సినిమా తీసింది 29 రోజులు.. ఆడింది 500 రోజులు

Telugu BOX Office

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. స్వయం కృషితో మెగాస్టార్ అయ్యారు. చిరు సినిమా వచ్చిందంటే థియేటర్లలో రచ్చ జరిగేది. అన్నయ్య సినిమాకు కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. మాస్.. యాక్షన్ చిత్రాలే కాదు.. కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ చిరు స్టైల్ ప్రత్యేకం. అలాగే ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు చిరు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన ఓ సినిమా అప్పట్లే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం నెల రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 500 రోజులు హౌస్ ఫుల్ బోర్డుతో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’.

1982లో మెగాస్టార్ చిరంజీవి.. మాధవి జంటగా నటించిన చిత్రం ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ పై కే.రాఘవ నిర్మించారు. దర్శకుడిగా కోడి రామకృష్ణను.. నటుడిగా గొల్లపూడి మారుతీ రావును ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఇది. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా 512 రోజులు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇందులో చిరు ఇమేజ్ కొత్తగా చూపించడమే కాకుండా.. కేవలం 29 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. యావరేజ్ టాక్ తో జర్నీ స్టార్ట్ చేసింది. కానీ మెల్లగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయాలతో పాలకొల్లు, నరసాపురం, సఖినేటి పల్లి, పోడూరు, భీమవరం, మద్రాసు ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారట. తొలిరోజు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు.. రెండు కేంద్రాల్లో వందరోజులు ఆడి భారీగా వసూళ్లు రాబట్టింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఏకంగా 512 రోజులు అడింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు.. చిరుకు.. దర్శకుడిగా కోడి రామకృష్ణకు ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచింది.

Share This Article
Leave a comment