మా ఇద్దరి మధ్య ఆ రిలేషన్ ఉంది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్

Telugu BOX Office

టాలీవుడ్ మన్మథుడు అనగానే మనకు గుర్తొచ్చే హీరో అక్కినేని నాగార్జున. ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఈయనకు లేడీస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికీ నవ మన్మథుడిలానే కనిపిస్తుంటారు. అయితే నాగ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ప్రస్తుతం దాంపత్య జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ గతంలో అందరిలాగే నాగార్జున మీద కూడా ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోయిన్స్‌తో అఫైర్ నడిపినట్లు… అందులో ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ టబు, అనుష్కతో ఆయన ప్రేమాయనం సాగించినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఆ రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.. ‘ టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. మా ముందున్న ప్లాట్ నా భార్య తను దగ్గర ఉండి కట్టించుకున్నారు. నాకు టబు సినిమాల్లోకి రాకముందు నుంచే తెలుసు. నా బెస్ట్ కోవర్కర్, ఫేవరెట్ హీరోయిన్. మా కుటుంబ సభ్యురాలు కూడా. మా నాన్న అమ్మగారికి కూడా తను చాలా ఇష్టం. మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. తనకు అసలు పెళ్లి చేసుకొనే ఆలోచనే లేదు. ఆమె చాలా ఎమోషనల్.. చెప్పాలంటే తనకు సైకియాట్రిక్ డాక్టర్ నేను. అందుకే ఎలాంటి బాధ కలిగిన టైం కూడా చూసుకోకుండా రాత్రి రెండింటికి అయిన నా పర్సనల్ నెంబర్ కు ఫోన్ చేస్తుంది. హైదరాబాద్ వచ్చేయ్ అంటాను. మా ఇద్దరి స్నేహబంధం చాలా గట్టిది.. గొప్పది కూడా.

ఇక అనుష్క విషయంలో కూడా ఇలాగే జరిగింది. నేనేమో హైట్ కదా అని టాల్ హీరోయిన్స్‌ని రికమెండ్ చేస్తాను. జోడీ బాగుంటుందని అనుష్కను తీసుకునేవాడిని. కానీ సమాజం పాడైపోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు’ అని నాగ్ వివరించారు. నాగార్జున ఇచ్చిన ఈ క్లారిటీతో ఇప్పటికైనా రూమర్స్‌ ఆగుతాయో కంటిన్యూ అవుతాయో చూడాలి మరి.

Share This Article
Leave a comment