డ్యాన్స్ మడతపెట్టేసిన సిమ్రాన్.. ఆమె ఎనర్జీకి అందరూ ఫిదా

Telugu BOX Office

డాన్స్ క్వీన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో స్టార్‌ హీరోల సరసన నటించి మెప్పించింది. 1997లో ‘అబ్బాయిగారి పెళ్లి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో మెరిసి అగ్ర నాయికగా ఎదిగింది. అప్పట్లో సిమ్రాన్ డాన్స్, డ్రెసింగ్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఉండేది. 2008 వరకూ తెలుగులో వరుస చిత్రాలు చేసిన ఆమె ఆ తర్వాత తమిళ, హిందీ చిత్రాలకే పరిమితం అయింది. ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలో కనిపిస్తోంది కానీ తెలుగులో మాత్రం రీ ఎంట్రీ ఇవ్వలేదు.

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టివ్‌గా ఉండే సిమ్రాన్ తాజాగా తాను డ్యాన్స్‌ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌ అవుతోంది. 47 ఏళ్ల వయసులోనూ సిమ్రాన్ ఎనర్జీ అదే లెవల్‌లో ఉందంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

తాజాగా మహేష్‌ బాబు మాస్‌ సాంగ్‌కు స్టెప్పులేసి అలరించింది సిమ్రాన్. ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు మాస్‌ స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె ఎనర్జీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సిమ్రాన్ లో డాన్సింగ్‌ ఈజ్‌ ఏమాత్రం తగ్గలేదని, 47 ఏళ్ల వయసులోనూ దుమ్ము దులిపేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. గతేడాది హిందీలో టైగర్‌-3 చిత్రంతో అలరించిందిన ఆమెకు ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాలున్నాయి. అయితే అందులో మూడు చిత్రాలు ‘ధృవ నక్షత్రం’, ‘వనంగమూడి’, ‘అంధగన్’ డిలే అయ్యాయి. ‘శబ్ధం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది

https://www.instagram.com/p/C4DKODYNEI0/

Share This Article
Leave a comment