పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీలో ఇమ్రాన్ ‘ఓం భావు’ అనే పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ని ఎదుర్కొనే బలమైన ప్రత్యర్థిని పరిచయం చేస్తూ మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు.

‘డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న.. నీ ఓమీ’’ అంటూ ఇమ్రాన్ డైలాగ్‌తో పరిచయం చేసిన ఈ గ్లింప్స్.. అంచనాలు భారీగా పెంచింది. చివర్లో హ్యాపీ బర్త్ డే ఓజీ.. అనే డైలాగ్ మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటీకే ఇమ్రాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేలా చేశాడు. ఇపుడు ఈ స్పెషల్ గ్లింప్స్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించాడు. వీటికి తోడు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇమ్రాన్ క్యారెక్టర్‌కి హై ఎలివేషన్ క్రియేట్ చేసింది. గతంలో పవన్ పరిచయానికి ఇచ్చిన మ్యూజిక్‌ని బీట్ చేసే మాదిరి ఇంపాక్ట్ తీసుకొచ్చింది.
‘సాహో’ ఫేమ్ సుజీత్.. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా ఓజీని తెరకెక్కించాడు. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ.. దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మున్ముందు ‘ఓజీ’ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
