రావిచెట్టును ఇలా పూజిస్తే కచ్చితంగా సంతానం కలుగుతుందట

Telugu BOX Office

హిందువులు అనేక రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు. వాటిలో రావి చెట్టు కూడా ఒకటి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం… అత్యంత పవిత్రమైన చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావిచెట్టుని విష్ణు రూపంగా భావిస్తారు. రావి చెట్టును విష్ణువుగా, వేప చెట్టును మహాలక్ష్మిగా భావించి వేప చెట్లకి, రావి చెట్లకు పెళ్లి చేస్తూ ఉంటారు. పైగా రావి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్లి చేస్తే, సాక్షాత్తు లక్ష్మీనారాయణుల‌కి వివాహం చేసినట్లుగా భావిస్తారు. రావి చెట్టు పుల్లలని పవిత్రమైన యజ్ఞ యాగాదులకి మాత్రమే వాడతారు.

రావి చెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు. శనివారం రోజు రావి చెట్టుని పూజిస్తే, మనకు శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తాయి. రావి చెట్టుకి నీళ్లు పోయడం వలన శని మనల్ని ఎలాంటి కష్టాలనుండి అయినా సరే కాపాడతాడు అని పండితులు చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావిచెట్టులో నివసించారని కొందరు నమ్ముతారు. ఔషధ గుణాలు కూడా రావి చెట్టులో ఉంటాయి. రావి చెట్టు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని, సంతానాన్ని తీసుకు వస్తుంది. రావి చెట్టుని పూజిస్తే, వివాహ జీవితంలో అడ్డంకులు, కలహాలు తొలగిపోతాయి. రావి చెట్టుని ఆరాధిస్తే, అదృష్టం కూడా కలిసి వస్తుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది.

అలాగే మగ పిల్లలు కావాలనుకునే మహిళలు ఈ చెట్టు చుట్టూ ఎర్రటి దారం లేదంటే ఎర్రటి వస్త్రాన్ని చుడతారు. ఇక శనివారం ఈ చెట్టుని పూజించడం వల్ల సంపద బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. క్రమంగా ఈ చెట్టుని పూజిస్తే, పిల్లల పెరుగుదల, అభివృద్ధి బాగుంటుంది. పెళ్లి కాని వారు రావి చెట్టు ఆకులను తీసి స్నానం చేసే నీళ్లలో వేసుకుని, స్నానం చేస్తే పెళ్లి కుదురుతుంది. ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు. గర్భం ధరించలేని వివాహిత మహిళలు, రావి ఆకులని తీసుకుని నీటిలో నానబెట్టి, ఉదయాన్నే రావి ఆకు ఉంచిన నీటిని తాగితే పిల్లలు కలుగుతారు.

Share This Article
Leave a comment