Kolikapudi Srinivasa Rao : కొలికపూడి శ్రీనివాస్‌కి ప్రజల బ్రహ్మరథం

TBO
By TBO

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. గెలిచిన వెంటనే అన్నింటినీ పరిష్కరిస్తానని మాట ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా తిరువూరులోని ఏడో వార్డులో ప్రచారం నిర్వహించిన ఆయనకు ముస్లిం మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్లకార్డులు పట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ వార్డులో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు, అలాగే ఇతర సామాజిక వర్గాలకు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు.

కూటమి తరపున సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ బాగుందని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ హాయాంలో ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి పథకాన్ని వర్తింపజేశారని… తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లులున్నా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ పథకాల డొల్లతనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని తలిపారు. సమస్యలపైన పోరాడుతున్న తనకు ప్రజలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొలికిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరువూరు నియోజకవర్గంలో మూత్రపిండాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తాము వచ్చాక అన్ని గిరిజన గ్రామాలకు కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. అలాగే ప్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉందని, వైఎస్సార్సీపీ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారని కొలికిపూడి అభిప్రాయపడ్డారు.

Share This Article