ప్రభుత్వానికే చెమటలు పట్టించిన బాలయ్య సినిమా.. బ్యాన్ ఎందుకు చేశారంటే

Telugu BOX Office

నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతూ వందకి పైగా సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ నేటితరం హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లోనే బాలకృష్ణ వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగా దర్శకుడు బాబి తో కూడా తన 109వ సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు బాలయ్య త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.

బాలకృష్ణ కెరీర్‌కి సంబంధించి ఓ విషయం ఈ తరానికి తెలియకపోవచ్చు. అందేంటంటే ఆయన నటించిన తొలి చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. బాలకృష్ణ బాల‌ నటుడిగా, హీరోగా పరిచయమైన తొలి చిత్రం `తాతమ్మకల`.. నటరత్న నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ స్వయంగా నిర్మించగా… ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అలనాటి అగ్రనటి భానుమతి, హరికృష్ణ, రాజబాబు, చ‌ల‌ప‌తిరావు వంటి అగ్రనటులు ముఖ్యపాత్రలో నటించారు. ఎస్ రాజేశ్వరరావు ఈ సినిమాకు సంగీతం అందించారు.

అయితే ఈ సినిమా తెరకెక్కించే సమయానికి కుటుంబ నియంత్రణపై ఎంతో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముద్దు.. ఆపై వద్దు అంటూ సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరతెక్కించారు. అందులో భాగంగానే కుటుంబ నియంత్రణ వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్- భానుమతి పాత్ర ద్వారా కొన్ని డైలాగులు కూడా చెప్పారు. అలాగే భూసంస్కర‌ణ‌ల‌ను కూడా వ్యతిరేకిస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

1974 ఆగస్టు 30న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అదే సమయంలో ప్రభుత్వ ఆగ్రహానికి కూడా గురైంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తాతమ్మ కాల సినిమాను రెండో నెలలో పాటు బ్యాన్ చేసింది. దాంతో ఎన్టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. దేశంలో ప్రజలందరూ కష్టపడి పని చేస్తే కుటుంబ నియంత్రణ, భూసంస్కర‌ణ‌లు అవసరం లేదు అన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వ విధానాలకు తాను వ్యతిరేకని కాదని ఎన్టీఆర్ తెలిపారు. అంతేకాదు సినిమాను బ్యాన్ చేయడంతో మళ్ళీ సినిమాలో పలుమార్పులు చేసి 1975 జనవరి 8న మరోసారి తాతమ్మ కాల సినిమాను విడుదల చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ నిషేధానికి గురై రెండోసారి విడుదలైన ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా రావటం మరో విశేషం.

Share This Article
Leave a comment