తలైవా తగ్గేదెలే… ఎవరికీ అందనంత ఎత్తులో

Telugu BOX Office

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా ఎంతో చలాకీగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాజాగా ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకొని నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు సుమారు 650 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. జైలర్ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ. 12 కోట్లకు కొనుగోలు చేయగా… రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టి రెండు రెట్లు లాభాలు ఆర్జించింది.

జైలర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122 కోట్లు కాగా ఈ సినిమా ఏకంగా 650 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అంటే ఏ స్థాయిలో లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు రావడంతో ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ రజినీకాంత్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మరో రూ.100 కోట్ల చెక్కు రెమ్యునరేషన్‌ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

‘జైలర్’ సినిమా కోసం రజనీకాంత్ ముందుగానే 110 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో కనకవర్షంలో మునిగి తేలుతున్న నిర్మాత మరో 100 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చినట్టు సమాచారం. ఇలా 100 కోట్ల రూపాయలు అధికంగా రెమ్యూనరేషన్ అందుకున్న రజనీకాంత్ ఈ సినిమాకు ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు.

ఇలా రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలు అందరిని బీట్ చేసి ముందు వరుసలో నిలిచారు. సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోగా పేరు పొందారు. తాను ఒక్కో సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా ఇప్పుడు రజనీకాంత్ ఈ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Share This Article
Leave a comment