నాలుగు రోజుల్లో రూ.500 కోట్లు… ‘జవాన్’ కలెక్షన్ల ఊచకోత

Telugu BOX Office

బాలీవుడ్ బాద్‌షాగా పేరొందిన షారుక్ ఖాన్ మరోసారి బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది ‘పఠాన్’ బాక్సీఫీస్‌ని షేకాడిస్తూ రూ.వెయ్యి కోట్ల క్లబ్‌ చేసిన షారుఖ్.. ‘జవాన్’తో రికార్డుల తుప్పు వదలగొడుతున్నాడు. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించి మరెవరికీ దక్కని అరుదైన రికార్డును షారుక్ తన సొంతం చేసుకున్నాడు.

సెప్టెంబర్ 7న జవాన్​గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్‌ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరడంతో షారుక్‌ రికార్డుకెక్కాడు. జవాన్ సినిమాకు ఆదివారమే 28లక్షల టిక్కెట్లు తెగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఏ హీరో అందుకోని అరుదై రికార్డని తెలుస్తోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే ఈ వీకెండ్‌ కల్లా ‘జవాన్’ రూ.వెయ్యి కోట్ల క్లబ్ చేరడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు తెగ సంతోష పడిపోతున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే ‘డంకీ’. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్​ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్​ అందుకున్నట్టే. గత పదేళ్లలో సరైన హిట్‌ లేకుండా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యే ప్రమాదంలో పడిన షారుక్ ఖాన్.. ఇప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో బాలీవుడ్‌కి పెద్దదిక్కుగా మారడం విశేషం.

Share This Article
Leave a comment