‘కూలీ’ ట్రైలర్ వచ్చేసింది… అదరగొట్టిన తలైవా

Telugu BOX Office

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ ట్రైలర్ వచ్చేసింది. ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో అందరి పాత్రలను రివీల్ చేస్తూ ఈ ట్రైలర్ సాగింది. తన ప్రాణ స్నేహితుడు కోసం కొంత విరామం తర్వాత రంగంలోకి దిగే దేవాగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ సంగీతం సమకూర్చాడు.  ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ట్రైలర్‌తో అవి మరింత పెరిగాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ట్రైలర్‌ని మీరూ లుక్కేయండి.

Share This Article
Leave a Comment