లీలమ్మో.. లీలమ్మో.. డ్యాన్స్‌తో దుమ్ము దులిపేశారు!

Telugu BOX Office

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదికేశవ’ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌, ఫార్చున్ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ‘లీలమ్మో లీలమ్మో’ అంటూ సాగే లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ సంగీతంలో నకాష్ అజీజ్‌, ఇంద్రావతి చౌహన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో మాసీగా సాగే ఈ పాటలో సింగర్ల వాయిస్‌కు తగ్గట్టు దుమ్ము దులిపేలా వైష్ణవ్‌, శ్రీలీల డాన్స చేశారు. ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి..

Share This Article
Leave a comment