‘చంద్రముఖి 2’ నుంచి మరో అప్‌డేట్.. పూనకాలే

Telugu Box Office

రాఘ‌వ లారెన్స్, పి.వాసు కాంబోలో వస్తున్న కామెడీ అండ్ హారర్ ఫిల్మ్ ‘చంద్రముఖి 2’ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘స్వాగతాంజలి’కి భారీ స్పందన రాగా.. తాజాగా విడుదలైన రెండో పాట కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.

లారెన్స్‌ డ్యాన్సింగ్ స్టైల్‌తో సాగిన ఈ పాట.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. వివేక్‌ రాసిన సాంగ్‌ను కీరవాణి కంపోజ్ చేయగా.. ఎస్పీ చరణ్‌, హారికా నారాయణ్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.

Share This Article
Leave a comment