రామ్ ఊరమాస్ లుక్… ‘స్కంద’ ట్రైలర్ వచ్చేసింది

Telugu BOX Office

యంగ్ హీరో రామ్ పోతినేని.. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో రామ్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌లు ‘ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే’ వంటివి బాగా పేలాయి. రామ్‌పై బోయపాటి శ్రీను చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు మెప్పిస్తున్నాయి. రామ్‌ను గతంలో ఎప్పుడూ చూడని పక్కా మాస్‌ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share This Article
Leave a comment