నా మాజీ భర్త గురించి మాట్లాడను.. వదిలేయండి ప్లీజ్

Telugu BOX Office

చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది రేణు. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రేణు.. తాజాగా పవన్ కల్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగా.. రేణు మాట్లాడుతూ ‘ఆయన గురించి నేను మాట్లాడను. పవన్ కల్యాణ్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అది ఆయన్నే అడిగి తెలుసుకోండి. ఆయన గురించి మాట్లాడి నేను ట్రబుల్స్ తెచ్చుకోలేను. ఈవిడకు ఏం పని లేదా.. ప్రతి ఇంటర్వ్యూలో మాజీ భర్త గురించి మాట్లాడుతుంది అంటారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి.. తిట్టే వాళ్లకు నేను మరో అవకాశం ఇవ్వలేను. ఆల్రెడీ ఇప్పటికే చాలా కాంట్రవర్శీలు క్రియేట్ చేశారు. ఆయన గురించి మాట్లాడాలి అంటే ఆయనే మాట్లాడాలి. మనం మాట్లాడలేం’ అంటూ చెప్పుకొచ్చింది.

Share This Article
Leave a comment