మహాశివరాత్రి విశిష్ఠత… ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు

Telugu BOX Office

భోగభాగ్యాలకు అతీతుడు. కాసులు, కానుకలు కోరుకోడు.. మనసు నిండుగా భక్తి, ఆరాధనతో నీళ్లతో అభిషేకించినా పరమ శివుడు సంతుష్టుడవుతాడు. భక్తుని కోర్కెలు తీర్చే భోళా శంకరుడు ఆ త్రినేత్రుడు.. పార్వతీదేవిని తన సగభాగంలో చోటిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు. హిందువులు ప్రతి ఏటా జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. మహా శివరాత్రి అంటే శివనామస్మరణతో రాత్రి అంతా చేసే జాగారం. దృక్ పంచాంగ్ ప్రకారం, ఇది మాఘ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. చాంద్రమాన హిందూ క్యాలెండర్‌లో ప్రతి నెల శివరాత్రి పండుగ గుర్తించబడుతుంది. శివ, శక్తి కలయిక యొక్క రాత్రిగా భావించబడటం వలన మహాశివరాత్రిని శుభప్రదంగా పరిగణిస్తారు భక్తులు.

మహా శివరాత్రి ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా శివుడు, పార్వతి వివాహం చేసుకుంటారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే – పార్వతి మాత ప్రకృతిని సూచిస్తుంది. వీరి కలయిక సృష్టిని ప్రోత్సహిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది. అనేక పురాణ ఇతిహాసాల ప్రకారం మహాశివ రాత్రి రోజు జాగారం చేసి శివుడిని ప్రార్థించడం ద్వారా తమ పాపాలను అధిగమించి, ధర్మమార్గంలో ప్రయాణించేందుకు తోడ్పడుతుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు.

మహాశివరాత్రి రోజున శివ భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు శివలింగానికి పాలతో అభిషేకం చేసి, మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తారు. శివరాత్రి రోజున, ఉదయం ఆచారాలను ముగించిన తర్వాత, భక్తులు సంకల్పం తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసాన్ని ఆచరించడం అంత శ్రేయస్కరం కాదు. షుగర్ లెవల్స్ పడిపోతాయి.. బీపీ డౌన్ అవుతుంది.. పాలు, పండ్లు తీసుకుంటూ శరీరం నీరసించకుండా చూసుకోవాలి.. నిజానికి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా భక్తితో శివనామస్మరణను, ఓంకారాన్ని జపిస్తూ ఉండాలని అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపవాసం ముగించేందుకు శివుని అనుగ్రహాన్ని పొందాలి.


లింగోద్భవం
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివయాల్లో ఎవరు గొప్ప అనే సంవాదం నెలకొంది. ఎవరు గొప్ప అనే వాదన సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెప్పాడని.. పురాణాల కథనం. లింగం అంతం తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో..అదే సమయంలో ఆదిని కనుకోవడానికి లింగంపై భాగం వైపు వెళ్తాడు. అయితే బ్రహ్మ, విష్ణు లిద్దరూ.. మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేక పోతారు. ఆయితే బ్రహ్మ ఆది కనుకోవడానికి వెళ్తున్న సమయంలో మధ్యంలో బ్రహ్మకు మొగలి పువ్వు , గోవు దర్శనమిస్తాయి. వారికి తాను లింగానికి ఆదిని చూశానని చెప్పమని.. అదే విషయం విష్ణు, శివయ్యలకు చెప్పాల్సిందిగా సూచిస్తాడు.

దీంతో శివుడికి బ్రహ్మ చెప్పినట్లు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెబుతారు. దీంతో ఆగ్రహించిన భోళాశంకరుడు బ్రహ్మకు గుడి ఉండదని.. మొగలి పువ్వు పూజకు పనికిరాదని, ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పిన గోమాత అబద్దం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోక ని చూస్తే పాపపరిహారంగా శివుడు శపిస్తాడు. అయితే విష్ణువు తాను లింగం అంతాన్ని కనుక్కోలేకపోయానని నిజం చెప్పద్మతో.. ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం ,మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువు ఇవ్వడం లింగోద్భవ సమయంలో జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో పేర్కొన్నారు.

Share This Article
Leave a comment