OTT Releases: OTTలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు.. ఓ లుక్కేయండి

Telugu BOX Office

OTT Release Movies

ఒకప్పుడు వీకేండ్‌ అంటే కొత్త సినిమాల విడుదల కోసం ఆత్రుతతగా ఎదురు చూసేవారు. మరి ఇప్పుడో ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాల కన్నా.. ఓటీటీలో విడుదల కాబోయే కొత్త సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ వీకెండ్‌లో ఓటీటీలో రీలీజైన సినిమాలు గురించి తెలుసుకుందాం. ఇటీవల విడుదలైన సినిమాల్లో కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీల్లోకి వస్తాయా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వీటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా.. ఒకటి హిందీ సినిమా. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆ సినిమాలు శుక్రవారం నుంచి ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.

‘డీజే టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ఈ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక థియేటర్లలో భారీ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ వీకెండ్‌లో మంచి రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ చూద్దామనుకునే వారికి టిల్లు స్క్వేర్‌ బెస్ట్ ఆప్షన్.

ఈ వీకెండ్‌ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మరో సినిమా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’. ఇక గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న విజయ్‌ ఫ్యామిలీ స్టార్‌ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్‌లో మూవీ చూడొచ్చు.

ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘లా పతా లేడీస్’. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్ కావాలంటే ఈ సినిమా మీకు బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు

Share This Article
Leave a comment