ఇదీ పవర్‌స్టార్ రేంజ్… పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోనూ ట్రెండింగ్

Telugu BOX Office

పవన్‌కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. అయితే, ఓటీటీలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనూ ‘బ్రో’ సినిమా రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన దగ్గరి నుంచి ఈ చిత్రం టాప్‌లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇండియాలో నం.1లో ఉండగా.. నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల లిస్ట్‌లో టాప్‌7లో నిలిచింది. అలాగే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో టాప్‌ 8లో ఉంది. దీంతో పవన్‌కల్యాణ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయింది.

తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. సముద్రఖని దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాయడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ ‘టైమ్’ అనే దేవుడి పాత్రలో కనిపించగా.. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు.

Share This Article
Leave a comment