శారద పూర్ణిమ.. చంద్ర గ్రహణం వేళ చేయాల్సిన పనులివే!

Telugu BOX Office
Stages of Lunar Eclipse

హిందూ పంచాంగం ప్రకారం, అశ్విని మాసంలో వచ్చే పౌర్ణమిని శారద పూర్ణిమ అని అంటారు. ఈసారి అక్టోబర్ 28వ తేదీన అంటే శనివారం నాడు మేష రాశిలో రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సాధారణంగా గ్రహణాలను అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. ఈ సమయంలో ఎవ్వరూ శుభకార్యాలను చేయరు. ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం రాహువు, కేతువు పౌర్ణమి రోజున రాత్రి వేళలో చంద్రుడిని మింగేస్తారు. అప్పుడు మనకు చంద్రుని దర్శనం కనిపించదు. ఈ నేపథ్యంలో అశుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈసారి చంద్ర గ్రహణం భారతదేశంలోనూ కనిపించనుంది. ఈ గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందే సూతక కాలం కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చంద్ర గ్రహణం వేళ కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ సులభంగా అధిగమించొచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుదాం..

చంద్రుని స్థానం బలపడేందుకు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం సమయంలో జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలోపేతం చేయడానికి తులసి ఆకులను నోటిలో వేసుకుని చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు గ్రహణ చెడు ప్రభావం తొలగిపోయి, మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది.


వ్యాపారంలో రాణించేందుకు..
వ్యాపారులు తమ వ్యాపారంలో అడ్డంకులను అధిగమించేందుకు, చంద్ర గ్రహణం రోజున పూజా గదిలో లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటో దగ్గర గోమతీ చక్రాన్ని సరైన పద్ధతిలో ప్రతిష్టించి పూజించాలి. అనంతరం 16 రకాల లక్ష్మీ మంత్రాలను జపించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పాలతో గోమతీ చక్రాన్ని పాలతో శుద్ధి చేసి దానిపై చందనం రాయాలి. పూజ ముగిసిన తర్వాత పసుపు గుడ్డలో కట్టి వ్యాపారం చేసే చోట భద్రంగా దాచుకోవాలి.

శని, రాహు-కేతు దోషాల నివారణకు..
ఎవరైతే కొత్త ఉద్యోగం చూస్తుంటారో.. మరోవైపు ఇప్పటికే కార్యాలయంలో ఉద్యోగంలో ఉండి సహోద్యోగులతో, ఉన్నతాధికారుల నుంచి ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే చంద్ర గ్రహణం తీపి అన్నం ఇంట్లో స్వయంగా తయారు చేసి కాకులకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఇలా చేయడం వల్ల మీకు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి.

అడ్డంకులను అధిగమించేందుకు..
కొంతమంది జీవితంలో ఎంతో కష్టపడుతున్నా అనుకున్నంతగా సక్సెస్ మాత్రం కాలేరు. ఈ నేపథ్యంలో కష్టానికి తగిన ఫలితం రావాలంటే చంద్ర గ్రహణం సమయంలో మీ గేటుకు తాళం వేసి ఉంచండి. ఆ తర్వాత మరుసటి రోజున ఉదయం ఆ తాళం తీసుకుని ఏదైనా ఆలయంలో విరాళంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి, అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

Stages of Lunar Eclipse

గ్రహణం చేయాల్సిన పనులు..
చంద్ర గ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ గ్రహణం 28న రాత్రి ప్రారంభమవుతుంది. కాబట్టి అంతకుముందు అంటే సాయంత్రం లోపు భోజనం చేయాలి. చంద్రోదయానికి ముందే ఆహారం తీసుకోవాలి. వీలైనంత సాత్విక ఆహారాలు తీసుకోవాలి. రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు రాత్రి 8 గంటలలోపు భోజనం ముగించుకుని పండ్లు, మజ్జీగ, పాలు తీసుకోవచ్చు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఏదైనా ఆహారం మిగిలితే జంతువులకు తినిపించాలి. తిన్న తర్వాత వంటగదిని శుభ్రం చేసి పాత్రలన్నీ కడిగేయాలి. అక్టోబర్ 29న ఆదివారం నాడు ఇంటి చుట్టూ గోమూత్రం, గంగాజలం చల్లిన తర్వాత పూజ చేసి వంటను ప్రారంభించాలి. గ్రహణ కాలంలో మీ ఇంట్లోని వస్తువుల్లో కాస్త గరిక వేయాలి. దీని వల్ల గ్రహణ ప్రభావం తగ్గిపోతుంది.

గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..
ఈ రాహు గ్రహణం భారతదేశంతో పాటు బెల్జియం, గ్రీస్, ఫిన్లాండ్, పోర్చుగల్, థాయిలాండ్, హంగేరి, ఈజిప్ట్, టర్కీ, ఇండోనేషియా, ఇటలీ, మయన్మార్, స్పెయిన్ వంటి అనేక దేశాల్లో కనిపిస్తుంది.

Share This Article
Leave a comment