లోక్‌సభ బరిలో పవన్‌కళ్యాణ్.. కేంద్రమంత్రి అయ్యే ఛాన్స్!

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగనుందనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే టీడీపీతో పొత్తు ఫైనల్‌ చేసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. బీజేపీతో పొత్తు వ్యవహారం ఫైనల్‌ దశకు చేర్చాడు.. అయితే, రానున్న ఎన్నికల్లో లోక్‌సభ బరిలో దిగే యోచనలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగానూ పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం.. ఎంపీగా పోటీ చేస్తే ఓ స్థానం నుంచి బరిలోకి దిగాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఇక, ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి.. కేంద్ర మంత్రి పదవి తీసుకునే యోచనలో ఉన్నారట పవన్‌ కల్యాణ్‌. అయితే, ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. అటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఒకేసారి పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే తర్జనభర్జనలో ఉన్నట్లు సమాచారం.

పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.. గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఈ సారి ఓ అసెంబ్లీ, మరో పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై జనసేన పార్టీ వర్గాల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు.. ఇదంతా ప్రచారంగానే జనసేన నేతలు చెబుతున్నా.. ఒక ఎమ్మెల్యే, మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు.. ఎంపీ స్థానానికి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే ఫీల్డ్‌ వదిలి పవన్‌ కల్యాణ్‌ మొత్తం ఢిల్లీవైపు వెళ్తారనే ప్రచారం వైసీపీ చేసే అవకాశం ఉంటుంది.. దీంతో.. ఓట్ల ఫరంగా కొంత నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా చేస్తున్నారట.. ఇక, ఈ రోజు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.. నిన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్.. అమిత్‌షా, జేపీ నడ్డాలతో చర్చలు జరపగా.. ఈ రోజు మరోసారి మూడు పార్టీలకు చెందిన నేతల ఉమ్మడి సమావేశం ఉంటుందని.. ఆ తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తుందంటున్నారు. జనసే-బీజేపీ 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించి.. మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Share This Article
Leave a comment