నేను లోకల్.. లోకేష్ నాన్ లోకల్.. గెలుపు నాదే – మురుగుడు లావణ్య

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవుతోంది. అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుండగా.. జగన్ సర్కారును కూలదోకి పవర్‌లోకి రావాలని టీడీపీ-జనసేన కూటమి ప్రణాళికలు రచిస్తోంది. రెండు వర్గాలు ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన సీట్లకు సంబంధించి గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తున్నాయి. అయితే ఈసారి అన్ని నియోజకవర్గాల కంటే మంగళగిరి సీటుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్.. ఈ సారి ఎలాగైనా గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు లోకేష్‌ని ఓడించే సత్తాగల అభ్యర్థి కోసం వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు లేదని తేల్చేయడంతో ఆయన కోపంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే నెల రోజులు తిరగకముందే మళ్లీ వైసీపీలో చేరి టిక్కెట్ ఎవరికిచ్చినా గెలుపుకోసం పనిచేస్తానని స్టే్‌ట్‌మెంట్ ఇచ్చారు. ఆర్కే బదులుగా మంగళగిరి ఇంఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం.. కొద్దిరోజులకే ఆయన్ని తీసేసి మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది.. ఆవిడే మురుగుడు లావణ్య. మంగళగిరిలో తనకు అన్ని వర్గాల్లో పట్టు ఉందని.. లోకేష్‌పై గెలిచి తీరతానంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తన ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించనని… ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తానని చెబుతున్నారు మురుగుడు లావణ్య. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి తనకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. తాను లోకల్ అభ్యర్థినని.. లోకశ్ నాన్ లోకల్ అని.. ఈ అంశం కూడా తనకు సానుకూలంగా ఉంటుందంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో తకు మద్దతుగా పనిచేస్తున్నారని… తన ఫ్యామిలీ కూడా అండగా నిలిచిందని తెలిపారు. టీడీపీ ఎన్ని అస్త్రాలు ప్రయోగించిన మంగళగిరిలో గెలుపు తనదేనని లావణ్య ధీమాగా ఉన్నారు.

Share This Article
Leave a comment