పర్సుని ప్యాంట్ వెనుక జేబులో పెడుతున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!

Telugu BOX Office
Business man safe keeping money wallet in the back pocket.
Unrecognizable Caucasian man puts his leather wallet into back pocket of the jeans

వాలెట్ లేదా పర్స్.. దీన్ని ఎక్కువగా అబ్బాయిలే వినియోగిస్తూ ఉంటారు. పర్సును చాలా మంది ప్యాంట్ వెనుక జేబులో పెడుతుంటారు. పెట్టుకోవడానికి.. తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా చేస్తుంటారు. అదే ఫ్రంట్ జేబులో పెట్టుకుంటే.. ప్యాట్ టైట్ గా ఉండటంతో పాటు చిరాగ్గా ఉంటుందని ఎక్కువ మంది పర్సును ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

అయితే ఇలా వెనుక జేబులో పర్సు పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ సేపు ప్యాంట్ వెనక జేబులోనే పర్స్ పెట్టుకోవడం వల్ల ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ అనే వ్యాధి వస్తుందట. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెడ, వెన్ను సమస్యలు:
ప్యాంట్ వెనుక పాకెట్‌లో పర్సు పెట్టడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. చాలా మంది వాలెట్ లో ఎన్నో రకాల కార్డ్స్, డబ్బులు, బిల్స్ వంటివి అందులోనే పెడుతుంటారు. అనవసరమైనవి కూడా అందులో ఉంచడంతో పర్సు బరువు పెరుగుతుంది. అలా కంటిన్యూగా బరువైన వాలెట్‌ను వెనుక పాకెట్ లో ఉంచుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తూంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. కానీ దీని కారణం అనేది చాలా మందికి తెలీదు.

కీళ్లు ఒత్తిడికి గురి అవుతాయి:
బరువు వాలెట్‌ను వెనుక జేబులో ఉంచుకోవడం వల్ల తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురవుతాయి. అంతే కాకుండా బరువు ఉండటం వల్ల ఆటోమెటిక్ గా చాలామంది ఒక వైపుకు వంగి నడుస్తూంటారు. ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా గమనించరు. ఈ కారణంగా వెన్ను పూసపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వాలెట్ బరువు తగ్గించుకోవాలి:

ప్రస్తుతం ఫోన్ లోని యాప్స్ ద్వారా చాలా పనులు అవుతున్నాయి. కాబట్టి వాలెట్ అవసరమైనవి తప్పించి మిగిలినవి వదిలేయడం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు పనికిరాని బిల్స్ ను తొలగించుకుంటూ ఉండాలి. దీని వల్ల వాలెట్ బరువు అనేది కాస్త తగ్గుతుంది. దీంతో మెడ, వెన్ను, కాళ్లు, భుజాల సమస్యలను నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 
Share This Article
Leave a comment