రోజా జామకాయ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

Telugu BOX Office

మనకి తక్కువ ధరలోనే అందుబాటులో ఉండే పండ్లలో జామ ఒకటి. అన్ని సీజన్స్‌లో జామకాయ దొరుకుతుంది. జామకాయని తీసుకోవడం వలన, చాలా ఉపయోగాలు ఉంటాయి. నారింజలో కంటే జామకాయల్లో సి విటమిన్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తరుచూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంతే జామకాయలు తింటే అంటు వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

జామకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇది పేగు కదలికలని నియంత్రించడానికి సహాయం చేసి మలబద్ధకం సమస్య దూరం చేస్తుంది. గుండెకు కూడా చాలా మంచిది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది. రక్తపోటుని కూడా కంట్రోల్ చేయగలదు.

జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది. జామకాయని తరుచూ తింటే చర్మం కాంతివంతంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనం. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

Share This Article
Leave a comment