నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Telugu BOX Office

నేటి కాలంలో ఫోన్ లేకపోయినా ఒక్క నిమిషం కూడా సాగడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ కూడా అందరి పనులూ ఫోనులతోనే. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

ఒత్తిడి పెంచవచ్చు
ఉదయం పూట తమ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు, ఈ-మెయిల్‌లు, సోషల్‌ మీడియా అప్‌డేట్‌లలో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించొచ్చు.

మానసిక ఆరోగ్యంపై
పొద్దునే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సప్‌లో మేసేజ్‌లు ఇలాంటివి శోధిస్తూ ఉంటారు. ఈ ప్రభావం మానసిక స్థితిపైనా ప్రతికూలంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కంటి ఆరోగ్యమూ దెబ్బ తింటుంది.

నిద్రలేమి
మంచి ఆరోగ్యానికి చక్కటి నిద్ర అవసరం. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ చూస్తే నిద్ర కరవవుతుంది. మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మోన్‌ నిద్ర రావటంలో సహాయపడుతుంది. కాంతి ఎక్కువసేపు కంటిపై పడటం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

Share This Article
Leave a comment