Movie News

గూగుల్‌‌లో అత్యధిక మంది వెతికిన టాప్‌-10 మూవీస్ ఇవే

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం ఎదురైంది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలందరూ ఓటీటీలకే అంకితమైపోయారు. సినిమా థియేటర్ల వైపు ప్రజలు రావడం మానేస్తారని అందరు అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హాళ్ల వైపు ప్రజలు పోటెత్తడం మొదలుపెట్టారు. దీంతో సినిమాలకు ఏమి కాదని అర్థమైంది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన 10సినిమాల జాబితాను ప్రతి ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేస్తుంది. ...

Read More »

RRR ట్రైలర్.. విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ (RamCharan)‌, కొమురం భీమ్‌గా యంగ్‌ ...

Read More »

బాలయ్య బాక్సాఫీస్ ఊచకోత.. ‘అఖండ’ కలెక్షన్ల ప్రభంజనం, తొలిరోజే రికార్డుల మోత

బాలయ్య బాక్సాఫీస్ దుమ్ముతులుపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ ఎన్నో అంచనాలతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు మించి తొలి షోతోనే మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ తొలి రోజు సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ...

Read More »

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సీతారామశాస్త్రి సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు” అని ప్రకటించాయి. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) ...

Read More »

శివశంకర్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. గత కొన్ని ...

Read More »

ఏపీ ప్రభుత్వం వల్ల పవన్ సినిమాకు భారీ నష్టం?.. ఎన్ని రూ.కోట్లంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ ...

Read More »

శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్ రొమాన్స్.. వాట్ ఎ కాంబినేషన్!

యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ...

Read More »

చిరంజీవి చెల్లెలిగా నయనతార.. రెమ్యునరేషన్ మరీ ఇంతా?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ నయనతార హవా కొనసాగుతోంది. వయసు పైబడుతున్నా ఆమె రేంజ్‌ పెరుగుతోందో గానీ.. ఎక్కడా తగ్గడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కనిపించనుంది. ‘సైరా నరసింహారెడ్డి’ లో చిరుకు భార్యగా నటించిన నయన్.. తాజా సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమా కోసం నయనతార ...

Read More »

‘నాగలక్ష్మి’ అదిరింది

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో ...

Read More »

‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేశాడు.. అదరగొడుతున్న టీజర్

అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్‌’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ ...

Read More »