ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) తాజాగా బుచ్చిబాబు సానా (Bucchibabu Sana) దర్శకత్వంలో పెద్ది(Peddi ) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల కాబోతున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇందులో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.. అందులో భాగంగానే మొన్నా మధ్య ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. గత రెండు రోజుల క్రితం “చికిరి చికిరి” అంటూ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు బుచ్చిబాబు. ఇకపోతే ఈ సినిమా నుండి వదిలిన ఈ అప్డేట్ చూసి లిరికల్ సాంగ్ వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించిన ఈ చికిరి చికిరి వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
