Spiritual

కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆరాధన ఎక్కువ. శివపార్వతుల ముద్దుల తనయుడైన ఆయన్ని… కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. సుబ్రమణ్యేశ్వరుడికి మంగళవారం ప్రీతికరం. వివిధ సమస్యలతో బాధపడేవారు ఆయన్ని భక్తితో పూజిస్తే పరిష్కారం చూపిస్తాడని భక్తుల నమ్మకం విజయాల కోసం..కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. ...

Read More »

నాలుగు శతాబ్దాల చరిత్రకు నీరాజనం.. మైసూర్ దసరా ఉత్సవాలు

దసరాకు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యే సంబరాలు.. దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే పర్యాటకులు.. ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం… 1610 సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు.. ఇప్పటికీ రాజకుటుంబం చేతుల మీదుగా జరిపించే దసరా వేడుకలు.. గజరాజు మీద స్వర్ణ అంబారీపై చాముండేశ్వరీ దేవి ఊరేగింపు… విద్యుత్ దీపాల వెలుగులతో అలరారే మైసూర్ ప్యాలెస్.. తింటే గారెలే తినాలు.. వింటే భారతమే వినాలి ...

Read More »

దసరా ఉత్సవాలు… సర్వశక్తి స్వరూపిణి బెజవాడ కనకదుర్గమ్మ

హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండుగ శరదృతువు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. శరదృతువులో జరుపుకునే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి ప్రస్తావన వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవాలయమే. ...

Read More »

దీర్ఘాకాలిక రోగాలను నయం చేసే ‘ధన్వంతరీ మంత్రం’

కొన్ని రోగాలు మందులు వాడితే తగ్గిపోతాయి. మరికొన్ని రోగాలైతే ఎన్ని మందులు వాడినా.. ఎంతకాలం గడిచినా మనిషిని పిప్పిపీల్చి చేస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామంది ఇలా దీర్ఘకాలిక రోగాల బారిన పడి కాలం వెళ్లదీస్తుంటారు. అయితే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్రీ ధన్వంతరీ ...

Read More »

హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటి?

ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడట. హనుమంతుడు ...

Read More »

హనుమంతుడికి సింధూరం ఎందుకంత ఇష్టమో తెలుసా

ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. ...

Read More »

హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారు.. ప్రయోజనం ఏంటి?

అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు. ...

Read More »

పూరీ జ‌గ‌న్నాథుడిని గ‌ణ‌ప‌తి రూపంలో ఎందుకు పూజిస్తారో తెలుసా?

వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి, ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాల మీద ఊరేగించడం ఆచారం. వీటిలో గజవాహన సేవ ఒకటి. అయితే, భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన పూరీలో మాత్రం జగన్నాథుడిని, ఆయన అన్న బలభద్రుడిని ఏకంగా ఏకదంతుడి రూపంలోనే ముస్తాబుచేయడం ఆసక్తికరం. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఆషాఢ శుద్ధ విదియనాడు మొదలయ్యే ప్రపంచ ప్రసిద్ధ ‘జగన్నాథ రథయాత్ర’కు ముందే, జ్యేష్ఠ ...

Read More »

పండగ రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారో తెలుసా?

ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు మారిన కాలానికి అనుగుణంగా తమ సంస్కృతిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. కాలం ఎంత మారినా ఇప్పటికీ ఎన్నో హైందవ కుటుంబాలలో కొన్ని ఆచారాలు ఇంకా మనుగడలో ఉన్నాయి. పవిత్రమైనటువంటి ప్రత్యేకమైన రోజులలో మాంసం తినకపోవడం అనేది ఇప్పటికీ హిందువుల్లో ఎందరో పాటించే ఒక ముఖ్యమైన ఆచారం. మామూలుగా చాలా మంది వారంలో కొన్ని రోజుల్లో అలాగే ...

Read More »

దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి. ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ...

Read More »