ఇక్కడ అద్దెకి పోలీస్‌స్టేషన్‌ ఇవ్వబడును

Telugu BOX Office

ఇళ్లతోపాటు రకరకాల వస్తువుల్ని అద్దెకి ఇవ్వడం, తీసుకోవడం మనకి తెలిసిందే… అయితే పోలీస్‌ స్టేషన్‌ను అద్దెకివ్వడం ఎక్కడైనా చూశారా! అంతేకాదు ఇన్‌స్పెక్టర్‌నీ, శిక్షణ పొందిన పోలీస్‌ డాగ్‌నీ, వాకీటాకీ, జీప్‌ తదితరాలను కూడా ఇస్తారు. అన్నీ కలిపి తీసుకుంటే ఒక ధర, ఏదో ఒకటి మాత్రమే ఎంచుకుంటే ఇంకో రేటు ఉంటుంది. ఇంతకీ అద్దె పోలీసు వ్యవహారం ఎక్కడో తెలుసుకోవాలనుందా…

కేరళలో స్టేషన్‌, జాగిలాలు, జీపు తదితరాలను అద్దెకిచ్చేందుకు అనుమతి ఉంది. అందుకు నామమాత్రంగానే ఫీజు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు ధరల్ని పెంచిన పోలీస్‌ శాఖ అందుకు సంబంధించి ఉత్తర్వులూ, కొన్ని నిబంధనలూ జారీ చేసింది. పోలీస్‌ స్టేషన్‌నీ, ఎక్విప్‌మెంట్‌నీ, జీపునీ, ఇన్‌స్పెక్టర్‌ సేవల్నీ వాడుకుంటే రూ.34 వేలు చెల్లించాలి. కేవలం సీఐ ర్యాంకు అధికారి సేవలకు దాదాపు రూ.3500, పోలీస్‌ జాగిలానికి సుమారు రూ.7500, వైర్‌లెస్‌ ఎక్విప్‌మెంట్‌ లేదా పోలీస్‌ స్టేషన్‌ కావాలంటే రూ.12000కిపైనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవల్ని కేవలం ప్రయివేటు పార్టీలు, వినోదం, సినిమా లేదా డాక్యుమెంటరీ షూటింగుల కోసమే ఉపయోగించాల్సి ఉంటుంది.

Share This Article
Leave a comment