రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే…. రైలెక్కడానికి వెళ్లేవారి వద్ద టికెట్, వారికి తోడుగా వెళ్లిన వాళ్ల దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉంటే చాలు. అయితే మన దేశంలోని ఒక రైల్వే స్టేషన్కి వెళ్లాలంటే అవి మాత్రమే టిక్కెట్ ఉంటే సరిపోదు. పాస్పోర్ట్, వీసా కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అవేమీ లేకుండా ఎవరైనా ఆ స్టేషన్లో అడుగుపెడితే అరెస్టు చేసి జైల్లో పెట్టేస్తారు. రైల్వేస్టేషన్కూ వీసా-పాస్పోర్ట్లకూ సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అక్కడే ఉంది మరి అసలు విషయం-
ఆ రైల్వే స్టేషన్ పంజాబ్ రాష్ట్రంలోని ఇండియా- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది. దాని పేరు అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ దాటగానే పాకిస్తాన్ వచ్చేస్తుంది. అందుకే ఆ స్టేషన్లోకి వెళ్లే భారతీయులకు ఇండియన్ పాస్పోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. మనదేశంలో చిట్టచివరిదైన ఈ స్టేషన్ మీదుగా పలు గూడ్సు రైళ్లు కూడా ప్రయాణిస్తుంటాయి.