ఆ ఊరిలోని స్త్రీలంతా 5 రోజులు నగ్నంగా ఉంటారు.. ఎందుకో తెలుసా?

Telugu BOX Office

కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. అవి వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్‌ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా ఉంటుందీ ఆచారం.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు నగ్నంగా మారిపోతారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా గడుపుతారు. ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని గ్రామపెద్దలు చెబుతున్నారు.

గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతారట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలింగనం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట.

ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ ఇలా నగ్నంగా మారి గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి. అంతేకాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట. ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రుల వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు పిని గ్రామస్తులు.

Share This Article
Leave a comment