ఆ గుడికి వెళ్తే పెళ్లిళ్లు జరుగుతాయట.. ఎక్కడుందంటే

Telugu BOX Office

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది. జీవితంలో ఒక్కసారే చేసుకొనే పెళ్లిని ఘనంగా చేసుకోవాలని అందరూ ఎన్నెన్నో కలలుగంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి పెళ్లి జరగకుండా మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారికి పెళ్లిళ్లను ఖాయం చేసే దేవుడొకరు ఉన్నారు.. ఆ గుడికి వెళితే అందరికీ పెళ్లిళ్లు అవుతాయట. ఇక ఆలస్యం ఎందుకు ఆ గుడి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ప్రత్యేక ఆలయం ఉత్తర కర్ణాటకలో ఇడగుంజిలో ఉంది.. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని పండితులు సైతం చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారట. సాధారణంగా వినాయకుడు ఏ గుడిలో అయినా నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు రెండు చేతులతో నిలుచుకున్న ఆకారంలో కనిపిస్తాడు.. అష్ట వినాయక క్షేత్రాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల క్రితం నిర్మించారని చరిత్ర చెబుతోంది.

పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే ఇక్కడ వినాయక స్వామి చెంత రెండు చీటీలను ఉంచుతారు. కుడి పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం ఉందని ఎడమ పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం లేదని చెబుతారు. దేవుని అనుగ్రహం లేదని భావించిన వాళ్లు మరో సంబంధం వెతుక్కుంటారని సమాచారం. ఇక్కడి దేవుడికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని ఇస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Share This Article
Leave a comment