తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ప్రజా న్యాయవాది రాపోలు భాస్కర్‌ని గెలిపించుకుందాం

Telugu BOX Office

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు రాబోయే ఎన్నికలు న్యాయవాద వర్గాల్లో కీలక చర్చగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. డిసెంబర్ 29 నుంచి జనవరి 9 వరకు నామినేషన్లు స్వీకరించగా, జనవరి 10న వాటి పరిశీలన జరుగుతుంది. జనవరి 13 నుంచి 16 వరకు ఉపసంహరణ గడువు ఉండగా, జనవరి 17న తుది అభ్యర్థుల జాబితా వెలువడుతుంది. జనవరి 30న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే అభ్యర్థులు జిల్లా జిల్లా కోర్టులను సందర్శిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ కీలక ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది, ప్రజల న్యాయవాదిగా పేరొందిన రాపోలు భాస్కర్ కూడా బరిలోకి దిగడం న్యాయవాద వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన అనుభవం, ప్రజాప్రతినిధిగా పని చేసిన పరిజ్ఞానం, న్యాయవాదిగా కోర్టుల్లో సాధించిన విశ్వసనీయత ఈ ప్రత్యేకతలు ఆయనని ప్రత్యేక అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. “నేను ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా కాదు… మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యుడిలా మీతో మాట్లాడుతున్నాను” అంటూ భాస్కర్ ప్రచారంలో చెబుతున్న మాటలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.

తనను గెలిపిస్తే బార్ కౌన్సిల్‌లో బలమైన ప్రాతినిధ్యం, పారదర్శక పాలన, న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని రాపోలు భాస్కర్ హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. బార్ కౌన్సిల్‌లో తీసుకునే ప్రతి నిర్ణయం స్పష్టంగా, జవాబుదారీతనంతో ఉండేలా చూస్తానని, ఏ వర్గం సమస్యైనా వినబడేలా వ్యవస్థను బలోపేతం చేస్తానని భాస్కర్ స్పష్టం చేస్తున్నారు. “మీ వేసే ఓటు నాకు ఒక పదవి కాదు… ఒక బాధ్యత” అనే ఆయన మాటలు ఈ ఎన్నికల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి. న్యాయవాదుల గౌరవం పెరగడం, సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అమలులోకి రావడం, విపత్కర పరిస్థితుల్లో పేద న్యాయవాదులకు తక్షణ సహాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయడమే తన ప్రాధాన్యాలుగా భాస్కర్ చెబుతున్నారు. న్యాయవాదుల మధ్య ఐక్యత పెరిగేలా, బార్ కౌన్సిల్ నిజమైన సేవా వేదికగా మారేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.

ఇక బార్ కౌన్సిల్ విధులు విషయానికి వస్తే, న్యాయ విద్య పూర్తి చేసిన వారిని న్యాయవాదులుగా నమోదు చేయడం నుంచి వారి విధుల పర్యవేక్షణ వరకూ కీలక బాధ్యతలు ఉన్నాయి. న్యాయవాదుల దుష్ప్రవర్తనపై విచారణ, క్రమశిక్షణ చర్యలు, పేదలు–దివ్యాంగులకు న్యాయ సహాయం అందించడం, న్యాయ విద్యా సంస్థల తనిఖీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష నిర్వహణ వంటి అనేక కీలక బాధ్యతలు రాష్ట్ర బార్ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ సమర్థంగా అమలవ్వాలంటే బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరం అన్నది న్యాయవాదులందరికీ తెలిసిన సత్యం.

ఈ నేపథ్యంలో… “నేను గెలిస్తే మాటలతో కాదు… పనితోనే మాట్లాడతాను. న్యాయవాదుల సంక్షేమం కోసం, మన వృత్తి గౌరవం కోసం, పారదర్శక బార్ కౌన్సిల్ కోసం తూ.చా తప్పకుండా పనిచేస్తాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వృథా చేయను” అంటూ రాపోలు భాస్కర్ హామీ ఇస్తున్నారు. రాబోయే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు కేవలం ఒక పదవికోసం కాకుండా, న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా నిలవనున్నాయి.

Share This Article
Leave a Comment