ఊబకాయానికి ఉలవలతో చెక్

Telugu BOX Office

ఒకప్పుడు ఉలవల్ని పశువులకు దాణాగా భావించేవారు. కానీ, నవధాన్యాలలో ఒకటైన వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనీ, వీటిని తింటే అనేక అనారోగ్యాలు పరారవుతాయనీ చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాం…

ఉలవలు ఆకలిని పెంచుతాయి. దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకున్నవారు తరచూ తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయానికి ఉలవలకు మించిన ఔషధం లేదంటోంది ఆయుర్వేదం. వీటిల్లో ఉండే పీచు కొవ్వుని త్వరగా కరిగించడంలో సాయం చేస్తుంది. ఉలవల్ని ఉడకబెట్టిన నీళ్లల్లో చిటికెడు ఉప్పు కలిపి తాగితే క్రమంగా సన్నబడతారట.

రుతుక్రమం తప్పినప్పుడు రోజూ కాసిని ఉలవలతో గుగ్గిళ్లు చేసుకుని తింటే సరి. రక్తహీనతను అధిగమించొచ్చు. ఇక, ఉలవల్లో ఐరన్‌, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల పోషకాహారలేమి తగ్గుతుంది. అంతేకాదు, వీటిల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి.

Share This Article
Leave a comment