పచ్చ కర్పూరం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Telugu BOX Office

పచ్చ కర్పూరాన్ని సంస్కృతంలో హిమ కర్పూర అంటారు. హిమాలయ పర్వతాలలో ఉండే వృక్షాల ద్వారా పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు. పచ్చ కర్పూరం పచ్చగా ఉండదు. తెల్లగా, చిన్న, చిన్న బిల్లలుగా ఉంటుంది. నిలువకాలం పెరిగిన తర్వాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. ప్యూర్ పచ్చ కర్పూరం ఆవిరైనప్పుడు ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయం అవుతుంది. అదే స్వచ్ఛతకు గుర్తు. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఔషధ యోగమైనవి. ఇందులో పచ్చ కర్పూరం శ్రేష్టమైనది. మూడుసార్లు బట్టి పెట్టి కాల్చి తయారుచేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైనది. దీన్ని మనం తినే పదార్థాలతో, దేవుడు పూజ గదిలో ఉంచుకుంటే ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందొచ్చు.

దేవుడి గదిలో ఉపయోగించే విధానం….
కర్పూరం అంటే స్వచ్ఛమైందని అర్థం. తినడానికి అర్హత కలిగిందని అర్థం. నిజానికి దేవుడి హారతి కూడా ఈ స్వచ్ఛమైన పచ్చ కర్పూరంతోనే ఇవ్వాలి… కానీ ఖర్చుకు భయపడి కెమికలతో తయారైన తక్కువ రేటు హారతి కర్పూరంతో హారతి ఇస్తున్నాము. దీని ద్వారా పూజ పవిత్రతే కాదు, వాతావరణం, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కెమికల్ హారతి కర్పూరం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి. పచ్చకర్పూరం యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే. ప్యూర్ కర్పూరాన్ని ఉపయోగించండి.

పచ్చ కర్పూరం వల్ల ప్రయోజనాలివే…
ప్రతిరోజు దేవుడి ముందు ఉంచే పచ్చ కర్పూరం ఉంచడం వలన గాలి పవిత్రం అవుతుంది. చలికాలం, వానకాలం. గాలి తేమలో మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి. పచ్చ కర్పూరం ఆవిరై గాల్లో కలిసి. గాలిని శుభ్రం చేస్తుంది. దీని వల్ల శ్వాస వ్యవస్థ మరియు ఊపిరితిత్తులు, శక్తివంతమై అనారోగ్య సమస్యలు తొలుగుతాయి. జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గుతుంది. అలాగే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. రోగనిరోధిక శక్తి, కండరాలలో నరాల్లో ఉత్తేజం కలుగుతాయి. అందుకే దేవాలయాలు ఇచ్చే ప్రసాదాల్లో పచ్చ కర్పూరం కలుపుతారు.

తిరుమల వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదాల్లోనే కాదు… ఆయన అలంకారంలో కూడా పచ్చ కర్పూరాన్ని వాడుతారు. ఇంట్లో తయారు చేసే స్వీట్స్ , లడ్డూలలో, కిచిడీ లాంటి వాటిలో కేజీకి 3 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ పచ్చ కర్పూరం పసుపు కలిపి పెడితే తగ్గుతుంది. నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనెలో కలిపి రాసుకోవాలి. మూడు చిటికెలు గ్లాస్ పాలలో వేసుకొని తాగితే రాత్రి సమయానికి రెట్టింపు చేస్తుంది. చిన్న లవంగమంత పచ్చ కర్పూ నోటి నుంచి వచ్చే దుర్వాసన, జ్వరాన్ని తగ్గిస్తుంది. పూజ గదిలో ఉంచితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది. చిన్న లవంగమంత పచ్చ కర్పూ నోటి నుంచి వచ్చే దుర్వాసన, జ్వరాన్ని తగ్గిస్తుంది. స్వచ్ఛమైన పచ్చ కర్పూరం చాలా ఖరీదు కలిగి ఉంటాయి. పచ్చ కర్పూరాన్ని మేము దశలు వారిగా. నియమాలు. బట్టి పెట్టి. తయారు చేయడం జరుగుతుంది.

Share This Article
Leave a comment