బాస్మతి బియ్యం ఎక్కువగా తినొచ్చా.. ఆరోగ్యానికి మంచిదేనా?

Telugu BOX Office

ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు చాలా మంది బిర్యానీ, పలావ్‌కే ఓటేస్తారు. అయితే అవి మామూలు బియ్యం కంటే బాస్మతి బియ్యంతో చేస్తే రుచే వేరుగా ఉంటుంది. ఈ బియ్యం నార్మల్ బియ్యం కంటే సన్నగా, పొడుగ్గా ఉంటుంది. అయితే, ఈ బియ్యంలో ఎక్కువగా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. అయితే బాస్మతి రోజూ తినొచ్చా… తింటే మంచిదేనా.. లేక అనారోగ్య సమస్యలు వస్తాయా? అన్నది తెలుసుకుందాం..

మామూలు బియ్యంలో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. బాస్మతి రైస్‌లో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. 50, 58 మధ్య గ్లైసెమిక్ లెవల్స్‌తో బాస్మతి బియ్యం తక్కువ నుండి మధ్యస్థ గ్లైసెమిక్ సూచిక ఆహారం. బాస్మతి బియ్యంలో ఎక్కువ స్థాయిలో ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించొచ్చు.

చర్మం, జుట్టుకి..
బాస్మతి బియ్యంలో ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుని ప్రోత్సహించే పోషకాలు ఉన్నాయి. ఇందులోని బి విటమిన్స్, జింక్ మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టుకి హెల్ప్ చేస్తుంది.

గుండె ఆరోగ్యం..
బాస్మతి బియ్యంలో సహజంగా సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన హృదయనాళ పనితీరుకు దోహదం చేసే కార్డియో ప్రొటెక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్..
బాస్మతి రైస్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కణాలను రక్షించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కీ రోల్ పోషిస్తాయి.

జీర్ణక్రియకి మంచిది..
బాస్మతి బియ్యంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రేగు కదలికలని ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను జీర్ణం చేసి తొలగించడానికి, ముఖ్య పోషకాలను పొందడానికి హెల్ప్ చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి.

బరువు తగ్గడం..
బరువు తగ్గడంలో బాస్మతి బియ్యం హెల్ప్ చస్తాయి. బాస్మతి రైస్‌లోని ఫైబర్ బాడీలో నెమ్మదిగా కలిసిపోతుంది. దీంతో ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. రోజంతా తక్కువ తినడానికి హెల్ప్ చేస్తుంది. బాస్మతి బియ్యంలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలని ట్రై చేస్తే బాస్మతి రైస్ బెస్ట్ ఆప్షన్.

అలర్జీలు ఉండవు..
బాస్మతి బియ్యం తింటే ఎలాంటి అలర్జీలు ఉండవు. అలర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు.

Share This Article
Leave a comment