రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదికి.. ఫ్లైఓవర్ నుంచి దూకిన యువకుడు

Telugu BOX Office

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు యువతీ యవకులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నదుల దగ్గర, లోయల దగ్గర, రైల్వే ట్రాక్‌ల దగ్గర ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. కొంతమంది అయితే నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఇలా రీల్స్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా చాలామందిలో మార్పు రావడం లేదు. తాజాగా జరిగిన సంఘటన అలాంటిదే. రీల్స్‌తో ఫేమస్ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఓ ఫ్లైవర్ మీది నుంచి దూకి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.

రీల్ స్క్రిప్టులో భాగంగా యువకుడు ముందే పక్కా ప్లాన్ చేసుకున్నాడు. అతడు ఫ్లైఓవర్ మీది కిందికి దూకే సమయంలో ఓ చెత్త ట్రాక్ అక్కడికి రావాలి. అతడు దాని మీదికి దూకాలి.  దెబ్బలు తగలకుండా ట్రక్‌లో ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆ యువకుడు ప్లై ఓవర్ ఎక్కాడు. ట్రక్ కూడా రావడం మొదలు పెట్టడంతో ఫ్లైఓవర్ మీది నుంచి దూకేశాడు. కానీ అతడు కిందికి చేరుకునేలోగా ట్రక్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో నేరుగా రోడ్డు మీద పడ్డాడు. స్పాట్‌లోనే కాళ్లు చేతులు విరిగిపోయి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కూడా కావడంతో అక్కడి నుంచి కదల్లేకపోయాడు. ఈ దృశ్యాలని చూసి స్థానికులు వెంటనే గమనించి అతడిని పక్కకి మోసుకెళ్లారు. కొన ప్రాణాలతో ఉన్న అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ పిచ్చిలో పడి జీవితాలు కోల్పోతున్న వారికి పరాకాష్ఠకు ఈ వీడియో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

Share This Article
Leave a Comment