Bharatiyudu 2 Trailer.. సేనాపతిగా కమల్ విశ్వరూపం

Telugu BOX Office

విశ్వనటుడు కమల్‌ హసన్‌ నటిస్తున్న చిత్రం భారతీయుడు-2 చిత్రం. మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు. కమల్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషనల్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కించారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో అన్ని భాషల్లో మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ కానుంది.

భార‌తీయుడు-2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పీ, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థలు ద‌క్కించుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మెప్పించారు. ఈ మూవీకి దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు-2’ రానున్నది. సేనాపతిగా కమల్‌ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు

Share This Article
Leave a comment