Tag Archives: Andhra pradesh

శ్రీవారి హుండీ గలగల.. టీటీడీ చరిత్రలోనే రికార్డుస్థాయి ఆదాయం

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ ...

Read More »

ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా మారిన NTR

నందమూరి తారకరామారావు.. ఆ చంద్ర తారార్కం తెలుగు ప్రజల గుండెల్లో విరాజిల్లే ఆరాధ్యమూర్తి… వెండితెర చరిత్రలో అజరామరమైన ఆయన నటనా ప్రస్థానం మనందరికీ తెలుసు. ఆ యుగపురుషుడి రాజకీయ జీవితం అందరికీ ఎరుకే. కానీ ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి ...

Read More »

అరుదైన శైవక్షేత్రాలు… పంచారామాలు.. కార్తీక మాసంలో తప్పక దర్శించాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పురాతన శైవ క్షేత్రాలను పంచారామాలుగా పిలుస్తుంటారు. పురాణాల పరంగా, భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలకు ఎంతో విశిష్ఠత ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల సందర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివున్ని పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. ...

Read More »

భక్తుల కోర్కెలు తీర్చే దైవం.. అయినవిల్లి సిద్ధి వినాయకుడు

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభనిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..అంటూ కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే గణనాథుడిని స్తుతిస్తుంది భక్తలోకం. విఘ్నాలు తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సుప్రసిద్ధ వినాయక ఆలయాలున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 ...

Read More »

ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!

‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ...

Read More »