మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జేబీ నారాయణ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటి టబు పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.

ఈ చిత్రంలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే శక్తివంతమైన డిప్యూటీ కమిషనర్ పాత్రలో కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌కు తగినట్లుగా ఆమెను అత్యంత ఇంటెన్స్, రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో ఆవిష్కరించారు. వీడియో గ్లింప్స్‌లో ఆమె చెప్పే “ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం” అనే మాస్ డైలాగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె ఆటిట్యూడ్, రగ్గడ్ పోలీస్ ఆఫీసర్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, దునియా విజయ్, బ్రహ్మాజీ, విష్ణు రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం రాబడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
