తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తమ స్తోమత మేరకు విరాళాలు అందజేస్తుంటారు. ఈ విరాళాదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.1 కోటి వరకు విరాళం ఇచ్చిన వారికి వివిధ రకాల సేవలు, దర్శన భాగ్యం, వసతి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేస్తోంది. చిన్న విరాళాదారులకు వేగవంతమైన దర్శనం, పెద్ద విరాళాదారులకు ప్రత్యేక వసతి, సత్కారాలు లభిస్తున్నాయి. ఈ విధంగా భక్తులు ఆపదమొక్కుల వాడికి కానుకలు సమర్పించడమే కాకుండా, స్వామి అనుగ్రహం, తితిదే అందించే ప్రత్యేక సౌకర్యాలను సైతం అనుభవిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం…

విరాళం: రూ.పదివేల నుంచి రూ.లక్ష వరకు
వెసులుబాటు: ప్రతి రూ.పదివేలకు ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది. తొమ్మిదిసార్ల వరకు అవకాశం ఇస్తారు. (శ్రీవాణి ట్రస్ట్)
విరాళం: రూ.లక్ష నుంచి రూ.5లక్షలు
వెసులుబాటు
- ఏడాదిలో ఒకసారి సుపథం ద్వారా ఐదుగురికి దర్శనం
- ఒకరోజు వసతి
- చిన్న లడ్డూలు: ఆరు
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క
విరాళం: రూ.5 లక్షల నుంచి రూ. పది లక్షలు
వెసులుబాటు
- ఏడాదిలో మూడుసార్లు సుపథం ద్వారా ఐదుగురికి దర్శనం
- మూడు రోజులు వసతి
- చిన్న లడ్డూలు: పది
- మహా ప్రసాదాలు: 5
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క
విరాళం: రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షలు
వెసులుబాటు
- ఏడాదిలో మూడుసార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం
- మూడు రోజుల వసతి
- చిన్న లడ్డూలు: 20 ;
- మహా ప్రసాదాలు: 10
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క, ఒక వెండి నాణెం(50 గ్రాములు)
విరాళం: రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు
వెసులుబాటు
- ఏడాదిలో మూడుసార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం… ఒకసారి సుపథం ద్వారా అవకాశం
- మూడు రోజుల వసతి
- పెద్ద లడ్డూలు: 4
- చిన్న లడ్డూలు: 5
- మహా ప్రసాదాలు: 10
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క, ఒక బంగారు నాణెం(5 గ్రాములు), ఒక వెండి నాణెం(50 గ్రాములు)
విరాళం: రూ.50 లక్షల నుంచి రూ. 75 లక్షలు
వెసులుబాటు
- ఏడాదిలో ఒక రోజు సుప్రభాత సేవ (ఐదుగురికి), మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, రెండుసార్లు సుపథం ద్వారా దర్శనం
- మూడు రోజుల వసతి
- పెద్ద లడ్డూలు: 6 చిన్న లడ్డూలు: 10
- మహా ప్రసాదాలు: 10
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క, ఒక బంగారు నాణెం(5 గ్రాములు), ఒక వెండి నాణెం(50 గ్రాములు)
విరాళం: రూ.75 లక్షల నుంచి రూ.ఒక కోటి
వెసులుబాటు
- ఏడాదిలో రెండుసార్లు సుప్రభాత సేవ (ఐదుగురికి), మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం, మూడు సార్లు సుపథం ద్వారా దర్శనం
- మూడు రోజుల వసతి
- పెద్ద లడ్డూలు : 8 చిన్న లడ్డూలు: 15
- మహా ప్రసాదాలు: 10
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క, ఏడాదిలో ఒక బంగారు నాణెం(5 గ్రాములు), ఒక వెండి నాణెం(50 గ్రాములు)
విరాళం: రూ.కోటికి పైగా
వెసులుబాటు
- ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ(ఐదుగురికి), మూడుసార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం దర్శనం, నాలుగు సార్లు సుపథం ద్వారా దర్శనం
- మూడు రోజుల వసతి
- పెద్ద లడ్డూలు: 10 చిన్న లడ్డూలు:20
- మహా ప్రసాదాలు: 10
బహుమానం: ఒక దుపట్టా, జాకెట్‌ముక్క, ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం, ఒక బంగారు నాణెం(5 గ్రాములు), ఒక వెండి నాణెం(50 గ్రాములు)
తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టులకు విరాళాలు అందజేస్తే సెక్షన్ 80(జీ) కింద ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి డిడక్షన్ వస్తుంది.
ఆ ట్రస్టులివే..
- శ్రీ వేంకటేశ్వర(ఎస్వీ) అన్న ప్రసాదం ట్రస్ట్
- శ్రీ బాలాజీ ఆరోగ్యప్రసాదిని స్కీం
- శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్(బర్డ్) ట్రస్ట్
- స్విమ్స్
- ఎస్వీ భక్తి చానల్,
- సర్వశ్రేయాస్ ట్రస్ట్
- ఎస్వీ ప్రాణాదాన ట్రస్ట్
- ఎస్వీ ఆపన్న హృదయ స్కీం
- ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్
- ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, వేదపరిరక్షణ ట్రస్ట్
- విరాళాలన్నీ చెక్ లేదా డీడీ రూపంలోనే ఆలయ ఈవో పేరిట అందజేయాలి. నగదు రూపంలో తీసుకోరు. తితిదే ఇచ్చిన ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఈ సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు www. tirumala.org ద్వారా తెలుసుకోవచ్చు.
