ఏడుపాయ‌ల దుర్గ‌మ్మ గుడి!

Telugu Box Office

ఏడుపాయలు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది. మెదక్ జిల్లా నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం యిస్తారు.ఏడుపాయల దుర్గా భవానీ గుడి – ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక మరియు మహారాష్ట్ర సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది.

ఈ ప్రదేశ వర్ణన మహాభారతంలో ఉంది. అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఇక్కడ సర్పయాగం చేసినట్లు విశ్వసించబడుతుంది. మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది. ఏడు పాయల వద్ద నిర్వహించబడే జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు.సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను ‘గరుడ గంగ’ అని పిలుస్తుంటారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.

దుర్గా అమ్మ‌వారు ఇక్క‌డ భ‌క్తుల‌తో పూజ‌లు అందుకుంటున్నారు. ఇక్క‌డ ఈ అమ్మ‌వారి చారిత్ర‌క నేప‌ధ్యం జ‌నాల‌లో చెప్పుకునేది ఒకేలా ఉంటుంది. త‌ప్పితే , పాత‌కాలంనాటి ఆధారాలు ప్ర‌స్థావ‌న తక్కువ‌గానే ఉంది. మ‌హాభార‌తంలో ఈ ప్రాంతం గురించి ప్ర‌స్థావ‌న ఉన్నంత‌లో నాటి స్థానికులు మ‌రింత‌గా మ‌హిమ‌లు, దుర్గ‌మ్మ గురించి వివ‌రించే గాథ‌లు త‌క్కువే. అనేకానేక పౌరాణిక గాధ‌ల‌కు పుట్టినిల్లు కావ‌ల్సి ఉండ‌గా అలాంటి చ‌రిత్ర‌ల‌ను నాటి స్థానిక క‌వులు, ర‌చ‌యిత‌లు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం అయ్యింది.

Share This Article