బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్.. త్వరలో కొత్త పార్టీ?

Telugu BOX Office

భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్ఠానం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సోమవారం అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తనా తీరు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కవిత.. తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఆ పదవికి కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే యోచనలో కవిత ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పార్టీ లైన్ దాటి అడుగులు వేస్తూ వస్తున్న కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చిన కవిత.. అదే పేరుతో గానీ.. మరో పేరుతో గానీ కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నారట. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన రావడంతో.. కొత్త పార్టీ వ్యవహారంలో కవిత మరింత స్పీడ్ పెంచనున్నట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a Comment