నాన్‌వెజ్ లవర్స్ చికెన్, మటనే, ఫిష్‌తో పాటు సీ ఫుడ్‌ని కూడా ఇష్టంగా లాగించేస్తుంటారు. సముద్రంలో దొరికే వాటిలో ఎక్కువగా రొయ్యలు, చేపలు, పీతలను ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. అయితే సీఫుడ్‌లో అన్నింటికంటే రొయ్యల్లో మంచి పోషక విలువలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
సముద్రంలో దొరికే రొయ్యల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మ సమస్యలకు చెక్ పెట్టేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించడంలో, మతిమరుపును దరిచేరకుండా చూడటంలో బాగా పని చేస్తాయి. రొయ్యలు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువుని తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. రొయ్యలలోని ప్రొటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణ జాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి.. రోజూ తింటే హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. వీటిలో ఉండే విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది.. మృదువుగా మెరిసేలా చేస్తుంది.
30 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గా రొయ్యల్ని తింటే.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆహార నిపుణులు, పరిశోధనలు చెబుతున్నాయి. ఈరోజుల్లో రక్త హీనత పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్‌గా తింటూ ఉండాలి. అలాగే సెలీనియం క్యాన్సర్ రాకుండా కూడా రొయ్యలు నిరోధిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.. ఇవన్నీ కూడా సముద్రపు రొయ్యల్లో ఉంటాని నిపుణులు అంటున్నారు. రొయ్యలు శరీరానికి మంచివి కదాని ఇష్టమొచ్చినట్లు తింటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ ఆహారమైనా మితంగా తింటేనే శరీరానికి మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.