ఈ మధ్య కాలంలో పెళ్లి విషయంలో మనుషుల ఆలోచనా వింతగా మారుతోంది. నచ్చిన జీవిత భాగస్వామే కావాలని అమ్మాయిలు, అబ్బాయిలు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. సోషల్‌మీడియాలో ఇన్ఫ్లుయిన్సర్గా ఉన్న ఓ అమ్మాయి ఇచ్చిన పెళ్లి ప్రకటన ఇప్పుడు అందరికీ అవాక్కయేలా చేస్తోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చేసే ఒక అమ్మాయికి వరుడు కావలెను అంటూ ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్‌లో ‘నా పేరు రియా . నాకు సరిపోయే రీల్ భాగస్వామి + పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నాను. అతనికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదు. నాతో కలిసి కపుల్/రిలేషన్ రీల్స్ చేయాలి. కొత్త ఆలోచనలతో పాటు ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్‌కి ఆలోచనలు ఇవ్వాలి. అతడు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండకూడదు. నన్ను కలుసుకునే ముందు. అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్డ్ చూసి నాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో తెలుసుకోవాలని మనవి. అలాగే అతడికి నా రీల్స్ / వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాలి’ అని పేర్కొంది. దీంతో ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. సోషల్‌మీడియా పుణ్యాన లోకం ఎలా మారిందోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.