భారతీయ ఎన్నికలలో, NaMo వాలెట్ PLATFORM’ target=’_blank’ title=’డిజిటల్-తాజా అప్డేట్లు, ఫోటోలు, వీడియోలు ఒక క్లిక్ దూరంలో ఉన్నాయి, ఇప్పుడు క్లిక్ చేయండి’> డిజిటల్ సెక్టార్లో మరింత సుపరిచితం. NaMo Again 2024.. హైదరాబాదుకు చెందిన ఒక NGO. ఇది సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
“2019లో మాది స్టార్టప్ బేబీ లాంటిది. ఇప్పుడు మా బృందం జంట నగరాల్లో అన్ని అంశాలలో మరింత చురుకుగా పని చేస్తోంది, మేము వందల సంఖ్యలో ఉన్నాం”అని పి.ఎల్.అరుల్ రాజ్ అన్నారు. ఈ సంస్థ యొక్క కోర్ కోఆర్డినేటర్లలో అరుల్ రాజ్ ఒకరు. వీరు చేస్తోన్న ప్రచారం తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది,
Namo Again 2024 క్యాంపెయిన్ కోసం సుమారు వెయ్యి మంది వరకు పనిచేస్తున్నారు. గత రెండు నెలలుగా వీరు ప్రజలతో మమేకమై నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలు, సాధించిన అభివృద్ధి వివరిస్తున్నారు.
‘NaMo Again 2024’ ప్రధాన ఆలోచన
పేరు కూడా ప్రధాన ఆలోచన అని చూపిస్తుంది. 2024లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని ఈ ఎన్జీవో సంకల్పించుకుంంది. దేశమంతటా ఇలాంటి కార్యాచరణే కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రచారం కోసం ఈ సంస్థ స్వచ్ఛందంగా పనిచేస్తోంది. రాజకీయ విశ్లేషకులు, యువత, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను ఈ ఎన్జీవో లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ మళ్లీ ఆయనకే ఓటేయాలని కోరుతున్నారు.
‘NaMo Again 2024’ టీమ్‌లు ప్రచారంలో వినూత్న పద్ధతులు ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో 50 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది సభ్యులు ఉంటారు. కొందరు ఇంటింటికి వెళ్లి 2047లో మన 100వ స్వాతంత్ర్య దినోత్సవానికి మోదీ విజన్‌ను వివరిస్తున్నారు. విజన్ 2047 ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన దేశం ఏ విధంగా బలపడతుంది… దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఈ వినూత్న కార్యక్రమానికి కోర్ కోఆర్డినేటర్ అయిన ఎ.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రి అయిన జి.కిషన్ రెడ్డికి ప్రజల పట్ల, దేశం పట్ల మక్కువ ఎక్కువని కొనియాడారు. ఆయన వైఖరి ముగ్ధుడిని కావడంతోనే ఈ కార్యక్రమంలో చేరానన్నారు. నేటితరం రాజకీయ నాయకుల్లో 90 శాతం మందిపై అవినీతి కేసులున్నాయని… అయితే కిషన్ రెడ్డి లాంటి నేతలు అరుదుగా ఉంటారని కొనియాడారు.
పి.ఎల్. అరుల్ రాజ్ మాట్లాడుతూ… ‘NaMo Again 2024’ టీమ్‌ల వినూత్న ప్రచారం పట్ల కిషన్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సికింద్రాబాద్ పట్ల కిషన్ రెడ్డికి ఉన్న అంకితభావాన్ని మరియు తెలంగాణ మరియు జంట నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో “The book ‘Report to the People’ లో పొందుపరిచినట్లు తెలిపారు. దీని డిజిటల్ కాపీలు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. నమో నినాదమే మనల్ని మెరుగైన దేశం వైపు నడిపిస్తోందన్నారు.
అశోక్ పట్నాయక్ మాట్లాడుతూ… “నాలాంటి యువకులకు మన దేశం పట్ల విజన్ ఉంది. చాలా మంది ప్రపంచ నాయకులు అనేక దశల్లో మన ప్రధానిని అభినందిస్తున్నారు. ఇది మన దేశాన్ని మరింత బలంగా బలోపేతం చేసింది. రాబోయే దశాబ్దానికి మోడీ భారతదేశానికి సమర్థుడైన నాయకుడు అని మేం నమ్ముతున్నాము. హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రజలు ఆయన పాలన పట్ల సంతృప్తి చెందారు. 2024లో మళ్లీ ఆయన్నే గెలిపించుకుందాం ’ అన్నారు.