కొడాలి నాని నోరు తెరిస్తే అన్నీ బూతులే.. రెచ్చిపోయిన పవన్‌కళ్యాణ్

Telugu BOX Office

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై హాట్‌ కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. కొడాలి నానిని తిట్టాలని తనకేమీ లేదన్నారు.. తనకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదని… వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశానని గుర్తుచేసుకున్నారు. అయితే కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని పవన్‌కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ అవ్వదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన పార్టీని కాపాడటానికి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగు కోసం వచ్చానన్నారు. రోడ్లు గోతులు.. అడిగితే ఎమ్మెల్యేలు బూతులు అంటూ సెటైర్లు వేశారు.. మరోవైపు.. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడుతున్నామన్న నెపంతో ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును వైయస్సార్ యూనివర్సిటీగా మార్చేశారని విమర్శించారు.

Share This Article
Leave a comment