ఏపీ రాజధానిపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సభలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మంధిర ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్, రాహుల్ గాంధీకీ ఆహ్వానం పంపినా రాలేదని దుయ్యబట్టారు. జగన్ ఏపీని అభివృద్ధిని చేయకుండా భ్రష్టు పట్టించారని.. ప్రజలపై 13 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు.. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్.. మద్యం సిండికేట్ లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

వైఎస్ జగన్ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి.. రాయలసీమ ప్రాజెక్టులు గాలికి వదిలేశారని అమిత్ షా ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును ముఖ్యమంత్రిని.. కేంద్రంలో ప్రధాన మోడీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన సత్యకుమార్‌ను ధర్మవరంలో గెలిపించాలని షా పిలుపునిచ్చారు.

ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏపీలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మత మార్పిడులకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు తెలపడానికి వచ్చానన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు తనను ప్రశ్నిస్తే.. ఏపీలో గూండాగిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం, ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని తాను చెప్పినట్లు వివరించారు.

ఎన్డీయే కూటమిని గెలిపిస్తే ఏపీ రాజధానిగా అమరావతినే చేస్తామని అమిత్ షా ప్రకటించారు. తెలుగు భాషను అంతమొందించేందుకే జగన్ ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని విమర్శించారు అమిత్ షా.. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను ఎవరు ఏమి చేయలేరన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు

Share This Article
Leave a comment