ఏపీలో గెలిచేది ఆ పార్టీయే.. తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

Telugu BOX Office

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ అనే సంస్థ పేరుతో వివిధ రాజకీయ పార్టీలకు సేవలందిస్తుంటారు. పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరే తనదైన స్కెచ్‌లతో అధికారంలోకి తీసుకురాగల దిట్ట. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లు వచ్చే ఎంతో కృషి. అలాగే ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘటన పీకేది. అయితే కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్లుగా ఉంటోన్న ఆయన.. సీఎం జగన్‌పై ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ సర్కార్ కేవలం సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని మరిచిపోయిందని చాలాసార్లు ఎద్దేవా చేశారు. జగన్ నొక్కే బటన్ల వల్ల ఎన్నికల్లో ఆ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని తేల్చేశారు. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మరోసారి కుండబద్దలు కొట్టేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని వాళ్ల సొమ్మునే ఖర్చు చేయడం తప్పని, ఇలా చేయడం వల్ల జగన్ రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఇదే జరిగిందని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాలన కాలంలో ఏం చేశారనేదే చూసి ప్రజలు ఓట్లు వేస్తారని… విద్య, ఉపాధి, అభివృద్ధి ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యాలెస్‌లో కూర్చుని బటన్లు నొక్కితే ఎన్నికల్లో ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్.. ఈ ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Share This Article
Leave a comment