వాళ్లతో కలిసి ప్రపంచాన్ని కాపాడతా – సమంత

Telugu BOX Office

అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీమ్‌ అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ నిర్వహించగా ఇందులో సమంత పాల్గొని సందడి చేసింది.

అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పిన సమంత ‘ది మార్వెల్స్‌’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ దీపావళి సినీ ప్రియులకు మరింత వినోదాన్ని పంచనుందని…. దీని ప్రమోషన్స్‌లో తాను భాగం కావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని వెల్లడించింది. చెడుపై మంచి సాధించే అంతిమ యుద్ధం కోసం ఈ సారి ఒకరు కాదు ఏకంగా ముగ్గురు సూపర్‌ హీరోలు పోరాడనున్నారని… ఈ యాక్షన్‌ మూవీ దీపావళి పండగను మరింత ప్రత్యేకం చేయనుంని సమంత పేర్కొంది.

తాను అవెంజర్‌ అయితే తన అభిమానులతో కలిసి ప్రపంచాన్ని కాపాడుతానని.. ఇండస్ట్రీకి చెందిన వారితో అయితే అల్లు అర్జున్‌, విజయ్‌, ప్రియాంక చోప్రా, అలియాతో కలిసి కాపాడుతానని సమంత పేర్కొంది. తన జీవితంలో ఉన్న ముగ్గురు సూపర్‌ హీరోల గురించి చెప్పాలంటే అమ్మ.. తనకెంతో ధైర్యాన్నిచ్చిందని… అలాగే నా స్నేహితులు, తన పెట్స్ కూడా సూపర్‌ హీరోస్‌తో సమానమేని తెలిపింది. మార్వెల్‌ స్టూడియోస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ది మార్వెల్స్‌’ నవంబర్‌ 10న ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మార్వెల్ యూనిట్‌తో కలిసి సమంత కనిపించడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a comment