పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. OG రిలీజ్‌కు ఉన్న అంచనాలు ఇప్పటికే ఆకాశానికి చేరిపోయాయి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు, ఎక్కడ చూసినా OG హైప్ క్రేజీగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 10 గంటలకు OG ప్రీమియర్ షోస్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీమియర్ షోస్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ కోవలోనే విజయవాడలో ప్రీమియర్ షోల ద్వారా ఓజీ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

విజయవాడలో మొత్తం 8 సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో OG ప్రీమియర్ షోస్ నిర్వహించనున్నారు. ఈ 8 థియేటర్స్‌లో మొత్తం 4286 టికెట్లు బుక్ అయ్యాయి. దీని ద్వారా వసూళ్లు రూ. 42,64,570/- కలెక్ట్ అయ్యాయి. ఇది విజయవాడ హిస్టరీలో ప్రీమియర్ షోస్ ద్వారా సాధించిన ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లుగా నమోదు అయ్యింది. ఇంతకుముందు, ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రీమియర్ షోస్ వసూళ్లు సాధించలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల కలిపి మొత్తం 64 ప్రీమియర్ షోస్ ప్రదర్శించనున్నట్లు టాక్ ఉంది. కేవలం ప్రీమియర్ షోస్ నుంచే రూ. 1.60 కోట్ల గ్రాస్ సాధించవచ్చన్న అంచనా పెట్టబడింది. మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు రాబడే అవకాశమున్నట్లు, గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. ప్రేక్షకులు మాత్రమే కాకుండా, సినీ వర్గాలందరూ OG ప్రీమియర్ హైప్‌ను గమనిస్తూ, పవన్ కళ్యాణ్ క్రేజ్ మరో లెవెల్‌లోకి చేరిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో OG ప్రీమియర్ షోస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. అభిమానులు “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కోసం మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ప్రీమియర్ షోస్ సెన్సేషన్‌గా మారాయి” అని ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
