బాలయ్యను బీట్ చేస్తోన్న విజయ్.. ప్యూర్ డామినేషన్

Telugu BOX Office

 

ఈసారి దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు. వీటిలో ఏది హిట్ అయినాసరే బాక్సాఫీస్ కళకళాలాడిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఏ మూవీకి ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. తమ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం తమిళ హీరో విజయ్ కంటే తెలుగు హీరో బాలయ్య వెనకబడిపోయారు. ఇంతకీ ఏంటా విషయం?

ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు ‘లియో’, ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూడింటిలో మీరు ఏ సినిమాక వెళ్తారని అడిగితే దాదాపుగా ‘లియో’ అని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు. ఈ విషయం అడ్వాన్స్ బుక్సింగ్స్‌లో కనిపిస్తోంది. విజయ్, బాలయ్య సినిమా టికెట్ల బుకింగ్స్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయగా అనుహ్యాంగా ‘భగవంత్ కేసరి’ కంటే ‘లియో’ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో ‘లియో’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు సమంగా స్క్రీన్స్ లభించాయి. కానీ లోకేశ్ కనగరాజ్ క్రేజ్ దృష్ట్యా ‘లియో’ వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో బాలయ్య సినిమా బుకింగ్స్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ బుకింగ్స్ అయితే ఓకే అనిపిస్తుంది. మరి ఈ మూడింట్లో ఏది హిట్ అవుతుందో? ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే రెండు మూడు రోజులు ఆగాల్సిందే.

Share This Article
Leave a comment